Happy Independence Day! 🇮🇳 इस आज़ादी पर, अपनी कलम को उड़ान दें।

Every verse is an act of freedom — write a poem, share your voice, and celebrate India with Kavishala.

✍️ Write for Freedom
ఒక's image
0627

ఒక

ShareBookmarks

ఒక మనిషి బ్రిడ్జిమీద నడుస్తూ జేబులోని చిల్లర డబ్బులు బిచ్చగాడి కిచ్చేస్తాడు; రిస్టువాచీని
ఎదురుగుండా వస్తూన్న నర్సు కిచ్చేస్తాడు; కోటుతీసి నీళ్ళలో పడేస్తాడు; దాని వెనుకనే
నీళ్ళలో పడిపోతాడు.
ఒక మనిషి వ్యాపారం పారం కనుక్కొంటాడు; వాడి చేతుల్లో రూపాయల చెట్టు మొలుస్తాయి.
అవి బ్యాంకుల్లో బంగారపు గుడ్లు పెడతాయి; వాటిలోంచి కన్నీరు సొనగా కారుతుంది.

ఒక మనిషి మైలురాయి దగ్గర మౌనంగా కూర్చుంటాడు; అనుక్షణం ఎవరో వస్తూన్నట్టు
నిరీక్షిస్తాడు; బస్సులు లెక్కపెడుతూ బటానీగింజలు తింటూ ఉంటాడు; మేఘాన్ని చూస్తూ
కాలాన్ని మర్చిపోతాడు.

ఒక మనిషి నిచ్చెనలు మోసుకుంటూ తిరుగుతాడు – సంచీలో బాతుగుడ్లూ వాడూను; గోడకు
నిచ్చెన ఎక్కి బాతుగుడ్డు ఆకాశంమీదికి విసురుతాడు; అంత ఎత్తు బంగారానికి హరిశ్చంద్రుణ్ణి
కొనుక్కొన్న ఆసామీ వీడే.

ఒక మనిషి రంధ్రాన్ని అనేషిస్తాడు; వాటి సైజుల్లో భేదం ఉంటుంది.

ఒక మనిషి అరాజకాన్ని అమ్మజూపుతాడు; దీర్ఘ బాహువుల్తో దేన్నో దేవుతున్నట్లే వుంటాడు;
యువకుల హృదయ రక్త కాసారాల్లో దొరికే గజ

నిమ్మపళ్ళు తప్ప మరేం తినడు; అదైనా రోజుకి ఒకసారి మాత్రం.

ఒక మనిషి కాంభోజ రాగం పాడుతూ కాలాన్ని వెళ్ళపుచ్చుతుంటాడు. వాడి దగ్గర ఒక్క
విపంచికూడా ఉందన్న సంగతి యిక్కడ జ్ఞాపకం చెయ్యక పోవడం అనవసరం; ఆ వేళల్లో
ఆలాపించే రాగాన్ని శాసించడానికే ఆ వేళ్ళు; వాటి స్పర్శకి నక్షత్రాలు అంటుకుంటాయి;
చంద్రుడులో సరస్సులు సలసల కాగుతాయి; నా గుండెల్లో చలికాలం చివురు తొడిగి సీతాకోక
చిలకతో పెళ్ళి మాటలు ప్రారంభిస్తుంది.

ఒక మనిషి కర్పూరం, కళ్ళకీ, సింధూరం చెక్కులకి రాసుకుంటాడు; పూసుకుంటాడు; వాడొక
కవి. రహస్య భాషలో అందుకున్న సందేశాలని వ్యాఖ్యానం చేస్తూ విమానశాఖలో పనిచేస్తాడు;
బజారు ధరలు పడిపోతూండడానికి వాడే గొప్ప కారణం.

ఒక మనిషి రుద్రాక్ష తావళాలు మెడలో వేసుకొని జపంచేస్తూ వుంటాడు; బొజ్జతో ఆలోచిస్తాడు;
వాడిముందు కొబ్బరికాయలు కొట్టొద్దు మొర్రో అని నేను మొత్తుకోవడంవల్ల ప్రయోజనం లేదని
తెలిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి?

ఒక మనిషి ఒక్కత్తెనే ప్రేమిస్తాడు; ఆమె చచ్చిపోతుంది; తరువాత కథ తెరమీద చూడండి.

ఒక మనిషిని ఉరితీస్తారు; వాడి చావుతో శాంతిని కొనుక్కుంటుంది సంఘం; న్యాయశాస్ర్తం
తృప్తిగా నిట్టూరుస్తంది; వాడి నెత్తురు చిందినచోట ప్రతి సాయంత్రం ఒక కన్నులేని కుక్కపిల్ల
జాలిగా మొరుగుతుంది; తన్ను అన్యాయంగా ఉరితీశారని చెప్పడానికి ఇష్టం లేనంత గరం ఆ
మానవుడికి.

ఒక మనిషి ఉపన్యాసాలిచ్చి గొప్పవాడవుతాడు; ఒక మనిషి చిత్తుగా తాగేసి బీదవాడవుతాడు;
ఒకడు దొడ్డమ్మ దగ్గర కానీ తీసుకుని గాలిపడగ కొనుక్కుంటాడు; ఇంకొకడు దాన్ని
లాక్కుంటాడు.

ఒక మనిషి పరారీ అయిపోతాడు; వొకడు పూనాకి పోతాడు; ఒకడు పెళ్ళాడేస్తాడు; ఒకడు
పడుక్కుంటాడు; మరొకరు కునికిపాట్లు పడతాడు; ఇంకొకరు బాతాఖానీ కొడతాడు; ఒకడికి
ఏడుపుకి నవొస్తుంది; ఒకడి నవు ఏడుపు తెప్పిస్తుంది; ఉదాహరణలతో సహా ఇది నేను
ఋజువు చేయగలను.

ఆండజ భీము డండడడ డండడ డండడ డండ డండ డండడడ డండ డండ డడ డండడ
డండడ డండ డండ…… సామీ దీని అంతమెప్పుడు?

శిష్యా ఇది అనంతం

Read More! Learn More!

Sootradhar