ఇదినా

Sri SriSri Sri30 Apr 1910

3 min read · 12.9K reads


ఇదినా సాతంత్ర్యదిన
మహాసంకల్పం
విధిగావికసించే
చరిత్రకొకకృతజ్ఞత,
ప్రజలకునివాళి,
ప్రభవించిననూతన భారత
పతాకకభివాదం,
భవిష్యదుజ్జల
భర్మయుగానికిఆహానం,
సకలజగజ్జనులారా
ఇదిగోనా సాతంత్ర్యసప్నం:
ఏ సాతంత్ర్యంనిమిత్తం ఎవరెవరోఎందరో దేశసేవా
భాసంతుల్ బాలవృద్ధుల్ పతితు లధికులప్రాజ్ఞులుత్ర్పజ్ఞులంతా
అసాశల్ వీడి లాఠీహతులయిఉరికొయ్యల్ కవుంగింటచేర్చా
రాసాతంత్ర్యం లభించిందనివిని హృదయం హ్లాద సంపుష్టమైతే

నవోదితసాధీనతానందితోత్పుల్లమైన
థగరంజెండాల పంటలతోనవుతూ పాడుతూఉంటే
ఉత్సాహప్రవాహంలో నేనూఒక బిందువునై
సాతంత్ర్యవాయువులు పీలుస్తూసాగిపోయా

ఆ సమయంలో అందరిమనస్సు
లావరించె నొకవ్యక్తి
అందరిలోనూ ఆ సమయంలో
ఆవహించెనొక శక్తి

అంతట్లోకే ఆకస్మాత్తుగా
జన సందోహంకరిగి
ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే
ఇదేం చిత్రమనిచూశాను.

ఒక పెద్ద కాంస్య విగ్రహా
నికి ప్రాణం వచ్చినట్టుగా,
ఒకే మేఘం గగన పథం దిగి
మానవుడై నిలిచినట్లుగా,
ఒక మహా వటవృక్షం
హఠాత్తుగా నడిచినట్టుగా,
ఒకే ఒక్క మానవమూర్తి
నా కళ్ళముందుకనిపించాడు
ఎం చేతో అతని ముఖం మీద
ఎప్పుడూ ఉండే పసిపాప నవులేదు?

ఆ మానవాననంలో
ఏదోకించిదిషాదం, కించిన్నిరాశ
కొంచెం విరాగం, కించి దసంతృప్తి,
ఆ మానవ వదనంఅందరికీ పరిచితమే,
అతడే నువూ, నేనూఅంతమందీ వెరసి.

సతంత్ర్యభరతవర్ష వాస్తవ్యుడా మానవుడు
అర్ధనగ్నంగాఆకాశాన్నే కప్పుకొని
నిండనికడుపుతో మాడుతూన్నకళ్ళతో
ఇలాఎంతకాలం నిలబడతాడా ప్రాణి?

అతణ్ణి జాగ్రత్తగాచూడండి
సతంత్ర్య భారతపౌరుడు,
అతని బాధ్యతవహిస్తామని
అందరూ హామీఇవండి.
అతని యోగక్షేమాలకు
అంతా పూచీ పడండి,
అతికించండి మళ్ళీ
అతని ముఖానికి నవు:

సాతంత్ర్యంఒక చాలా అందమైనవువు,
చాలావాడైన కత్తి, విలువైనవజ్రం
సాతంత్ర్యంతెచ్చే వెన్నెల్లోబాధ్యతలు
సామర్థ్యంతోనిరహిస్తామని

సంకల్పం చెప్పుకుందాం:

భగవంతుని ప్రార్ధించిందికి
బహుశా ఇదిసమయం కాదు,
పాతవి గుంజాళించిందికి
బహుశా ఇదిసమయం కాదు.

ఇది మనకొక దీక్షాసమయం
ఇది మనకి పరీక్షా సమయం
ఆవేశం ప్రకటించిందికి
అసలే ఇది తరుణంకాదు–

రా: నేస్తం, పోదాం : చూదాం
మువన్నెల జమ్డాపండుగ ;
రా: నేస్తం, లేదాం: చూదాం;
మన భారతజనసౌభాగ్యం.

అటు చూడు సముద్రం,నేస్తం
హర్షానికి పర్యాయపదం:
ఇటు చూడు విహాయసనేత్రం
దుఃఖానికి అధ్యాహారం:

ఈ రెండింటిమధ్యనిలిస్తే
నీ లోపల లోలోపలికే
ఆలాపన లాలోకిస్తే
వినపడదా ఒక సంగీతం,
విడివడదా ఒక సందేశం;

ఇదీ నా సాతంత్ర్యదిన
మహా సంకల్పం.
ఇది నా ప్రజలకునివాళి
సతంత్ర్య భారతపతాకాని
కిది నా అభివాదం.
భవిష్య దుజ్జల
భర్మయుగానికి ఆహానం,
సరిహద్దులులేని
సకల జగజ్జనులారా:
మనుష్యుడే నా సంగీతం,
మానవుడే నాసందేశం:

Sri Sri
About the poet

Sri Sri

Srirangam Srinivasa Rao, popularly known as Sri Sri, was a Telugu poet and lyricist. He was a member of PEN INDIA, Sahitya Academy, Vice-President of the South Indian Film Writers Association, Madras and President of the revolutionary writers association of A…

View profile & all 21 Poems / Stories

More Poetry & Stories You May Like