మరచిపోయిన's image
0389

మరచిపోయిన

ShareBookmarks


మరచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయిన జెండా చిహ్నం
మాయమైన మహాసముద్రాలను
మరు భూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది
శిలాశాసనంగా మౌనంగా
ఇధ్రధనస్సు పీల్చే ఇవాళిటి మన నేత్రం
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు

కర్పూర ధూమధూపంలాంటి
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవడో పాడిన పాట
ఎవడో ఎందుకో నవేపాప

బాంబుల వర్షాలు వెలసిపోయాక
బాకుల నాట్యాలు అలసిపోయాక
గడ్డి పువులు హేళనగా నవుతాయి.
గాలి జాలిగా నిశశిస్తుంది.

ఖడ్గాన్ని రద్దుచేస్తుంది ఖడ్గం
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
పొలంలో హలంతో రైతు
నిలుస్తా డివాళా రేపూ

ప్రపంచాన్ని పీడించిన పాడుకలని
ప్రభాత నీరజాతంలో వెదకకు
ఉత్పాతం వెనుకంజ వేసింది
ఉత్సాహం ఉత్సవం నేడు

అవనీమాత పూర్ణగర్భంలా
ఆసియా ఖండం ఉప్పొంగింది
నవ ప్రపంచ యోనిదారం
భారతం మేలుకుంటోంది.

నేస్తం మనదుఃఖాలకి వాయిదా వేద్దాం
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం
ఇంకోమాటు వాగాదం ఇంకోనాడు కొట్లాట
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురుఫాసు

Read More! Learn More!

Sootradhar