
0 Bookmarks 49 Reads0 Likes
ఈ క్షణానికీ ఇదే క్షణానికీ మధ్య
నీవూ నేనూల అస్తిత్వాల మధ్య
ఒకే మాట, వంతెన.
అదే నీవై నీలోకి నువ్వు
ప్రవేశిస్తావు: తనను తాను
ఉంగరం లాగా
చుట్టుకున్న ప్రపంచంలా.
ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డును
ఎప్పుడూ కలుపుతూ నిలువెల్లా
వంపు తిరిగిన దేహం: ఒక ఇంద్ర ధనువు.
నేను ఆ ఒంపులపై పాటలు పాడతాను
ఆ వంపుల నీడలో నిదురిస్తాను.
No posts
No posts
No posts
No posts

Comments