
0 Bookmarks 50 Reads0 Likes
ఒంటరియైనా
కొండ చివర తపస్విలా
పచ్చదనం కోల్పోని
ఈ మొక్క.
ఆగని ఒరవడిలో రాళ్ళని దాటుకు
జీవితాన్ని ఉరికించే
ఆనంద పారవశ్యంతో
ఈ నది.
తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.
రెక్కలు విప్పి
నీలి ఆకసమయే
హృదయం.
No posts
No posts
No posts
No posts

Comments