భయోద్విగ్నక్షణంలో's image
NaN min

భయోద్విగ్నక్షణంలో

విజయ్ కోగంటివిజయ్ కోగంటి
0 Bookmarks 46 Reads0 Likes

ఆనుకున్న గోడ
అదాటున కూలిపోయి
అనంతంలోకి పడిపోతున్నట్టు

ఆకాశం నుంచి మనుషులు
తలక్రిందులుగా
పైకి జారిపడి భయపెడుతున్నట్టు

ఆధారంగా పట్టుకున్న చేయే
నిరాధార శూన్యత లోకి
తోసేసి నవ్వుతున్నట్టు

నిద్రలో
పొడిబారిన తడికన్ను
ముల్లై గుచ్చుకున్నట్టు

గుండె బయటపడి
నిప్పుల కుంపటిపై
పొర్లాడుతున్నట్టు…

No posts

Comments

No posts

No posts

No posts

No posts