నయాగరా's image
0 Bookmarks 51 Reads0 Likes

కరిగి కన్నీరైన అనంత జలరాశి
పరవళ్లు తొక్కుతున్న ప్రవాహం
ఆధారం కోల్పోయి అంతెంతునుండి జారిపడుతున్న జలపాతం
సూర్యకాంతిని హత్తుకుని రాళ్ల మీద తల బాదుకుంటున్న ఇంద్రధనుస్సు
తనకు తానుగా తెలుసుకోలేని అందమైన అద్భుతం
ఒళ్లు ఝళ్లనిపించే ఆకాశ అవయవం

ఎంతయినా నీరు మరచిపోదేమో
విడిచిపోతున్న బాధలో
కన్నీటి తుంపర్లతో
తడిపి వీడ్కోలు చెబుతుంది

దారి చూపేవారు లేకపోయినా
జాడలైనా మిగల్చని రాకపోకలే –
తిరిగి రాలేని గమ్యం చేరేందుకు
అంత వేగమెందుకు నయాగరా!

నయాగరా!
చిత్రాల్లో బంధించి మేము దాచుకున్నట్టు
గడ్డ కట్టించి చూసుకుంటుందా నిన్ను ప్రకృతి
ఒక్కోమారు
నయాగరా!

నా మనస్సులో నువ్విపుడు
ఎన్నాళ్లయినా
అలసిపోని అహ్లాద సరస్సువి
ఆగిపోని వేణునాదానివి
మరచిపోలేని జ్ఞాపకానివి
నయాగరా!

నీ ఒక్క బిందువు
నీడగా అయినా సరే
నా శరీరంలోనే
కలకాలం నిద్రించనీ.

No posts

Comments

No posts

No posts

No posts

No posts