యమునలో మునక's image
0 Bookmarks 45 Reads0 Likes

ఎక్కడికక్కడ కత్తెరతో పలకరిస్తూ
తుప్పట్టిన పేజీతో కడుక్కుంటూ
చిత్రవిచిత్రాండ పిండాకూడులే
పది వేల్లెమ్మని చేయి జార్చుతో
తెలిసిన వాగుకాదు సాగూకాదు
తుమ్మముళ్ల పాన్పని తెలిసినా సరే
తప్పని శరణం గఛ్ఛామి

చల్లటి మంట మళ్లీ పెట్టు
ప్రాపంచిక మాలిన్యంతో
పాలిపోయిన రహస్యాలని
చెట్టుకో పుట్టగా తంతూ
ముడికో చుక్క చొప్పున హుక్కు చొప్పున
దోసిట్లోంచి వాకిట్లోంచి చీకట్లోంచి
వాణ్నీ దాన్నీ చూసి తరించి
వేగి మాడి మసై రసాలూరుతూ…

చివుక్కులెన్నో తుడుచుకుని
చమక్కులద్దుకుని మళ్లీ
యుగాలకొద్దీ చిగురాకులౌతున్న
చివరాకలి చిత్తడి కాంక్షకు
వందన చందనాలరగదీస్తూ

ఫ్రేముడు వైమనస్యాలని
ఇంకొక్కటిమ్మని సరేలెమ్మని
కానీ- చాలని కానీ
ఒక్క దూకు దూకి మగతతో
మడతపెట్టి-
వూసిన మండే కిళ్ళీ* సుఖపు రుచి నెమరేసుకుంటూ…

*ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లో ఫైర్‌పాన్.

No posts

Comments

No posts

No posts

No posts

No posts