వొహ మొహం's image
0 Bookmarks 60 Reads0 Likes

కాలినడకల్లో కట్టెగా మారినదాన్ని
నీళ్ల పాకెట్‌ని ఖిచిడీ ముద్దని
గుంపు మీదికి చిమ్మిన డిసిన్ఫెక్టెంట్‌ని
అమ్మానాన్నా ఇంకా రాలేదేమని చూసే చిన్నారిని

కాపాడగల సూదిని మాత్రని మాస్క్‌ని స్కాల్‌పెల్‌ని
గోపురం ముందు నదీప్రవాహంలో విరిగిన వంతెన కింద
తొడతొక్కిడిలో నొక్కుకుపోయిన పసిమొహాన్ని
జోడించిన చేతులని విడదీసి
తొడలమీదకి పడిన చేతుల మోసాన్ని

తీర్థంలో రంగరించి పోసిన మత్తుని
ఇంకో మతం మీద సందేహాన్ని పిడిగుద్దుని
తిరగబడ్డ చక్రాలకి వేళ్లాడిన మాంసం ముద్దని
ఉపగ్రహం చూపించిన భూచక్రాన్ని
విరిగిపడ్డ అలని – పెనుగాలికి ఎగిరిపోయిన రేకుని
గల్లంతైన బెస్తని

క్యూలో కుప్పకూలిన పాతనోట్ల కట్టని
పాసయినట్లు తెలీక తన్నేసుకున్న స్టూల్‌ని
బువ్వ తినిపిస్తూ జార్చుకున్న మూడో అంతస్తు బిడ్డని
చేతులుమారిన వోటుని – పారిన సారాని
పెరిగిన బొజ్జని – కబ్జాని – నల్లని గన్‌మాన్ల మధ్య తెల్లని టోపీని
విడిగా మోగిన మాటని – వడిగా తొక్కిన బాటని – బిడ్డలమీద పేలిన తూటాని

నిజంగా…
పైకెత్తని వేలుని – ప్రశ్నించని గొంతుని
గోడల మధ్య నీడల్లో గుట్టుగా పీల్చే శ్వాసని
వీపుమీది వాతలని మర్చిపోతుండే మధ్యతరగతిని
కళ్లు మూసుకున్న కలాన్ని
అవున్నేనే బిచ్చగాణ్ని
ఇండియాగేట్‌లో లేని అనామకుణ్ని

No posts

Comments

No posts

No posts

No posts

No posts