తెలుపు-నారింజ ఘోష's image
NaN min

తెలుపు-నారింజ ఘోష

శ్రీనివాస్ బందాశ్రీనివాస్ బందా
0 Bookmarks 49 Reads0 Likes

తెల్లని రెక్కల్ని విడదీసి ఒకసారీ
తల వేగంగా పైకీ కిందకీ ఆడించి మరోసారీ
తన భాషలో తను
ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్లతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్లినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…

అదే ఊళ్లో
అవే రెక్కలు అవే ముక్కులు బుగ్గలమీద
అవే నారింజ రంగు మచ్చలు
పల్చని పసుపు తోకా సన్నటి పొడవాటి వేళ్ళు
భయమే అస్తిత్వమై బతుకే వ్యాపారమై
మెడలో ముక్కుని దాచుకుని
కళ్లు మూసుకుని గట్టిగా పట్టుకుని
మోటుగా లోనికి దూసుకొచ్చే చేతినుంచి తప్పించుకుంటూ
పాటలేకా పాడలేకా
అలా చూస్తుండటం రొదలో నిశ్శబ్దంగా అరుస్తూ…

“యే ఆఠ్ సౌ కా హై. వో సాత్ సౌ పచాస్. బోలో కోన్సా చాహియే?”

No posts

Comments

No posts

No posts

No posts

No posts