కొత్త తాళం's image
0 Bookmarks 52 Reads0 Likes

పలకల త్రికోణాల పరాలోకనాలతో
నువ్వు నీలోకీ నేను నాలోకీ కలుస్తూ మనలోకీ
అదే దారి అదోసారి మరోసారి కొట్టుకెళ్తూనే
నడుస్తూ కొన్నిసార్లూ గంతు వేస్తూ కొన్నిసార్లూ
నిన్నూ నన్నూ దాటాలని చూస్తూనే
టపటప మోగుతున్న పెదవులని
రెపరెపలాడుతున్న ఎడదలని
మాటల చివరన విడుదలని
గొంతు లోతుల్లో మార్చుకుంటూ
నటిస్తున్నాం విభ్రమని

తరంగాలు కలిసినా తరంగదైర్ఘ్యాలు కలవని
పైకెంత ఎదగనీ కిందచూపులతోనే ఈదుతూ
గమకాలు వడగడుతూ కాలాన్ని
చెరో వైపుకీ చూస్తూ కాళ్ళలోకి దిగని ముళ్లు లెక్కిస్తూ
నిష్క్రమణ నియమాలు వల్లిస్తూ
ఇంక చాలింకా ఎందుకని నీ మాటనీ నా పాటనీ
చుట్టలు చుట్టేసి ఎగరేద్దామా
మళ్లీ మబ్బుల్లో కరుగుదామా
తాళం చెవులిచ్చి పుచ్చుకుంటో…

No posts

Comments

No posts

No posts

No posts

No posts