ఇదే మ‌న ప్రేమ‌క‌థ‌'s image
NaN min

ఇదే మ‌న ప్రేమ‌క‌థ‌

పన్యాల జగన్నాథ్ దాస్పన్యాల జగన్నాథ్ దాస్
0 Bookmarks 55 Reads0 Likes

‘నాకిష్టం లేదు’ అంటావు నువ్వు.
‘ఔను! నాకూ ఇష్టం లేదు’ అంటాను నేను.

నువ్వింకో మాట అనేలోగానే-
నేనిలా ప్ర‌క‌టిస్తాను.
‘నీ ఇష్ట‌మే నా ఇష్టం’
అంటే-
నీ అయిష్ట‌మే నా అయిష్టం అని ధ్వ‌నించేలా.

ఇష్టాయిష్టాల‌న్నీ ఏక‌మ‌య్యాక‌
ఇక విభేదాలుంటాయ‌నుకుంటామా?

కొట్టుకుచావ‌డానికి
నీకూ నాకూ కోటి కార‌ణాలుంటాయి.
దిక్కుమాలిన లోకం
వేలెత్తి చూపిస్తే
లోకం క‌ళ్ల‌నే మ‌నం వేళ్ల‌తో పొడిచేస్తాం.

No posts

Comments

No posts

No posts

No posts

No posts