స్నానాల గదిలో's image
NaN min

స్నానాల గదిలో

పాలపర్తి ఇంద్రాణిపాలపర్తి ఇంద్రాణి
0 Bookmarks 79 Reads0 Likes

రెక్కలు ముడుచుకున్న బాతులా
కొంకీ మీద కూచునుంది
తువ్వాలు

సబ్బు పెట్టెలో
ఘుమఘుమల ఊపిరి తీస్తూంది
సబ్బు బిళ్ళ

బాదంకాయ తొట్టి పొట్టలోంచి
వెల్ల వేసిన పైకప్పుకు చేరుతోంది
నీటి ఆవిరి

విలాసంగా దేవతావస్త్రాలను
తొడుగుతూన్నది
ఈల పాట

ఆవిరి నిండిన ఈ గదిలో
నేనొక్కదానినే

మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

No posts

Comments

No posts

No posts

No posts

No posts