అన్నీ చెప్పగల భాష's image
NaN min

అన్నీ చెప్పగల భాష

పద్మలత అయలసోమయాజులపద్మలత అయలసోమయాజుల
0 Bookmarks 28 Reads0 Likes

అన్ని చెప్పగల భాష
అక్కడే ఆగిపోయింది.
వేసుకుందామంటే ఏచొక్కా
నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
పెంకితనమే నా భాష కొచ్చింది.
ఎంత దువ్వినా వంగని రింగుల జుట్టు
ఎంత కట్టినా కుదరని ఆర్గండీ చీర
తెగిన చెప్పుతో నడిచే కాలి నడక
అక్కడే కూలబడింది.
పోనీ మరోమాటేదైనా
వెతుకుదామంటే
కర్ఫ్యూలో పాత బస్తీలో
తెరచిన దుకాణంలా
తిరణాళ్ళలో పడిపోయిన
పదిపైసల బిళ్ళలా
చెప్ప పెట్ట కుండా
రాత్రికి రాత్రే రైలెక్కేసి
కాశీకి పారిపోయిన సంసారిలా
నాకు దొరక్కుండా పోయింది.

No posts

Comments

No posts

No posts

No posts

No posts