రెండు కవితలు's image
0 Bookmarks 55 Reads0 Likes

భయవిభ్రమంలో
చిన్ని ప్రాణం
మృత్యు గృహలో నిలబడి
ఎర్రని గాయాలతో

చుట్టూ
ఒకే దృశ్యం
చీకటి దృశ్యం

నిరాశ
నిస్సహాయత
ఎర్ర దీపంలా వుంది

మృత్యువు,
వెంటే నడుస్తున్నట్టు
ఒక నీడ.

ఆప్రదేశమంతా గాలికి కొట్టుకుపోతూ చెల్లాచెదురుగా రాలిన పావురాల ఈకలు.

అణువణువునా జలదరింపు మంటను రాజేస్తుంటే ఆక్రోశపు గీతాలు రాత్రుల వెంబడి.

గులకరాళ్లు గుచ్చుకుంటుంటే పెనుగులాటను దాచుకుంటూ సరిపెట్టుకుంటూ తూలిపడుతున్న ప్రతిసారి, నేలపై వేళ్లను ఒత్తిపెడుతూ నిగ్రహించుకుంటున్న సమయం జీవన్మరణ ఊగిసలాట.

ఒంటరిగా కొంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి వెళ్ళలేక ఊపిరాడనివ్వని అలజడి.

గడియ గడియ గారడీ చేస్తుంటే గాఢంగా అలుముకున్న చీకటితో కొన్ని గీతల మధ్య అలాగే ఆగిపోవడం ఒక ఓటమి, చురుక్కుమనిపించే చెంప దెబ్బలాంటి ఓటమి.

ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటే దుఃఖం మెలిపెడుతుంటే ఉక్రోషం అతి గంభీరంగా రాలుస్తున్న సిరా చుక్కలు.

No posts

Comments

No posts

No posts

No posts

No posts