నల్లతోలు: కథ నచ్చిన కారణం's image
NaN min

నల్లతోలు: కథ నచ్చిన కారణం

కె. వి. గిరిధరరావుకె. వి. గిరిధరరావు
0 Bookmarks 40 Reads0 Likes

కథ నచ్చకపోవడానికి కారణమో, కారణాలో చెప్పమంటే చాలా తేలిగ్గా చెప్పొచ్చు. వస్తువు బాగోలేదనో, కథనం కుదరలేదనో, శైలి ఛండాలమనో, వాతావరణం బాగా లేదనో, శిల్పం (అంటే?) మృగ్యమనో – కథలను వొలిచి కొలిచే పదునైన పడికట్టు పదాలతో చీల్చి చెండాడవచ్చు. కానీ, కథ నచ్చిన కారణం చెప్పమంటే కథ వ్రాసినంత కష్టమే!

వేలుపిళ్ళై – సి. రామచంద్రరావు, 2011

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 120పే. రూ. 55.00

‘వేలుపిళ్లై’ కథలో గోపాల్ చెట్టియార్ లారీలోంచి దిగి, అక్కడ బజారులో పనిచేసే పిల్లలకు బీడీలు పంచడం నా కళ్ళముందే జరిగిన అనుభూతి కథ చదివిన ప్రతిసారీ కలుగుతుంది.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించి – నాకు ఈ కథ నచ్చిన కారణాలను విన్నవించుకుంటాను. కథ నాకెందుకు నచ్చుతుందో, మిగిలిన నా సహపాఠకులకు అవే కారణాలతో అదే కథ నచ్చాలని లేదు. వారికి కథ నచ్చడానికి (లేదా నచ్చకపోడానికి) గల కారణాలు వేరుగా ఉండొచ్చు కూడా!

మాతృదేశంలో కేవలం శరీరం రంగు వల్ల పేట్ రావ్, వలస పాలకుల వారసుల వివక్షకు గురి కావడం కలచివేసే విషయం. పరాయి నేల మీద, నాలాగ వలస వచ్చిన వాళ్ళు అక్కడక్కడ అప్పుడప్పుడూ వివక్షకు గురౌతున్నామన్న సంగతి గుర్తించడం, ఆవేదనతో ఆవేశపడడం మనకు అనుభవమే! బ్రిటీషర్లతో సమానమైన హోదా, పరిచయాలు గల పేట్ రావ్ శరీరం రంగు కారణంగా కొంతమందితో వెలివేయబడ్డం (అది పార్టీ రూములోంచా లేక…?), పార్టీ హోస్ట్ మిస్టర్ స్టూవర్ట్ దాన్ని ఆపాలనుకోవడం, అప్పుడు కప్పుకున్న రంగుతోలు జారిపోయి, మానవ సహజమైన స్వీయ ప్రయోజనాలు స్నేహాన్ని, విచక్షణను శాసించడం ఈ కథలో పతాక సన్నివేశం!

దేశాలు, మతాలు, రంగుల కన్నా వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమన్న నిజాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం. చెప్పదలుచుకున్న విషయమ్మీద పూర్తి అవగాహన, చెప్పే విధానంలో రచయిత నేర్పు, సన్నివేశాల ఎంపికలో, వాటి కూర్పులో ప్రదర్శించిన నైపుణ్యం ఈ కథను కలకాలం నేను గుర్తుంచుకునేలా చేశాయి.

No posts

Comments

No posts

No posts

No posts

No posts