డబల్‌యూ డబల్‌యూ డబల్‌యూ డాట్ నోస్టాల్జియా డాట్ కాం's image

డబల్‌యూ డబల్‌యూ డబల్‌యూ డాట్ నోస్టాల్జియా డాట్ కాం

కనకప్రసాద్కనకప్రసాద్
0 Bookmarks 17 Reads0 Likes

Double click on Kurupam
చల్లని చీకటి తెలియని ఈ అగ్ని ద్వీపాలలో
ఉండుండి ఎప్పుడైనా దీపాలు పోవాలి
బుగ్గివీధులలో జముకు నాట్యాలు చూడాలి
ఇరుకు బస్సులలో చెమట పన్నీరు కావాలి
మర్యాద వేదికల మీద
ఇన్ని రేటియోసినేషన్లు కావు
T.R. మహదేవన్‌ Y.S. కృష్ణన్‌లు కావు
Double click on రెల్లివీధి
కోడిపెట్టల మేష్టరు ట్యూషన్లు కావాలి
గోధుమలు పామాయిల్‌ రేషన్లుకావాలి

చీకట్లు వాలాలి చీకట్లుచీకట్లు
మట్టి నడవలలో పాతలాంతర్లు వెలగాలి
దిగులు పిట్టల గుంపులుతీరాలు చేరాలి

No posts

Comments

No posts

No posts

No posts

No posts