వలలెందుకు?'s image
0 Bookmarks 24 Reads0 Likes

నువ్వు సముద్రాన్ని
ఒంటి నిండా పులుముకొంటావు
నేను నదిలో మునిగినవాణ్ణి

ఉప్పు, తీపి కలసిన
గరగరలా ఉంటుంది
పెదాలు చప్పరిస్తుంటే

చేపలన్నీ నీళ్లలో ఉంటే
నువ్వూ నేనూ ఈ పక్కమీద
ఈదుతున్నామెందుకు?

చల నిశ్చలాల తగువులాట
ఒంటికంటుకున్న
మట్టికి పరిమళం
కవ్వపు గాలికి మబ్బు రంగు

చూస్తూ చూస్తూ తుఫాను వేళ
దిగుడు బావిలోకి
తొంగి చూడడమెందుకు?
పాములన్నీ
పొదలమధ్య లుంగచుట్టుకొని

కొండ దుమికినప్పుడు
జడలా అడ్డుకున్న గరిక
నడిచే వేళ
ఊతమిచ్చిన వెదురు
కమిలిన కాలమే
ఉమ్మనీటి తట్టు

అటుకి, ఇటుకి
చేపల దూకుడు
వలలెందుకు, వడగళ్ల వాన!

No posts

Comments

No posts

No posts

No posts

No posts