ఓ సాయంత్రం's image
0 Bookmarks 55 Reads0 Likes

ఒక మేఘం
నీళ్ల కోసం తిరుగుతూ ఉంది
తెల్లగా స్పంజ్ ముక్కలా
కోనేటి మీద వాలుతూ

మబ్బు ఒకటి
నీళ్లతో బరువెక్కి నడుస్తోంది
తలకెత్తుకున్న బిందెతో అమ్మలా

మబ్బుల గుంపులు
దగ్గర దగ్గరగా
దుమ్ములేపుతూ
ఇంటి బాట పట్టిన
గేదెల మందలా

త్రుళ్లి పడుతున్న
సాయం కాంతలా
మెరుపు

చప్పుడు చేస్తూ
మట్టతో పాటు
పడిన కొబ్బరికాయలా
ఉరుమొకటి

ఇంక జల్లుపడుతుందని
ఎక్కడ్నించో ఎగిరి వచ్చింది
తూనీగ

గాలి చడి చేయకుండానే
కంటి అద్దం మీద చినుకు

No posts

Comments

No posts

No posts

No posts

No posts