ఆమెకు దయలేదు's image
NaN min

ఆమెకు దయలేదు

ఇంద్రప్రసాద్ఇంద్రప్రసాద్
0 Bookmarks 21 Reads0 Likes

ఒక్క ముడత లేకుండా
పక్క సరి జేస్తాను
తలగడ సర్దిపెడతాను
దీపం తగ్గిస్తాను
మంద్రంగా సంగీతం
వినిపిస్తూ ఉంటుంది

రమ్మని పిలుస్తాను
గుసగుసలు పెడతాను
గొంతులోనే
అంకెలు లెక్క పెడతాను
గుర్తొచ్చినవన్నీ
నెమరేసుకొంటాను

వస్తోందనే అనుకుంటాను
నుదుటి మీద ముద్దు పెట్టినట్టే
దుప్పటిలోకి చేరినట్టే
అనిపిస్తుంది

అనుకోకుండా పాదాల మీద
చిన్న స్పర్శ
పక్కమీద చిన్న ముడత
గాలి కెరటాల హోరు
ఎక్కడో కాంతి రొద
ఇంక ఈ రాత్రి
నిరీక్షణే

శలవురోజు మధ్యాహ్నమో
భుక్తాయసం వేళో
అలసిన సాయంత్రం వేళో
పుస్తకంలో అక్షరాలు
చెదిరిన వేళో
చటుక్కున కావలించుకొని
సమయాసమయాలతో
నిమిత్తం లేకుండానే
అపార ప్రేమతో సత్కరించే
ఆమెకి ఈవేళ దయలేదు

భవభూతి వాక్యమే శరణు
రాత్రిరేవం వ్యరం సీత్.

No posts

Comments

No posts

No posts

No posts

No posts