గోపిని: దేహం మొండి గోడల మీంచి…!'s image
NaN min

గోపిని: దేహం మొండి గోడల మీంచి…!

గోపిని కరుణాకర్గోపిని కరుణాకర్
0 Bookmarks 58 Reads0 Likes

చెంగావి రంగు ఎండ
మొండిగోడ దేహం మీంచి
ఊగుతూ ఊగుతూ ఊసరవెల్లి నీడలు
తెగని రంపపుకోత
ఎగిరే కాకి ఎంతకూ వాలదు

భూమి ఒక సుడిగాలి
ఆకాశమంతా ఒకే కన్ను
సముద్రం ఒకే ఒక్క కన్నీటి చుక్క
తడికె కన్నాల నుంచి చూస్తున్నాను
మూడో కాలొకటి నడచి వస్తోంది
నల్లమబ్బు ఒకటి దేహం మీద వాలింది
రెప్ప కదలిన అలికిడి లేదు
కల కలవరింతా లేదు
కిటికీలో సగం వంగిన జామకొమ్మకు
మౌనంగా
పండూ నేనూ వేలాడుతున్నాము
తెగిన గాలిపటం
గిరికీలు కొడుతూ జారిపోతూ ఉంది
ఏదీ చేతికందదు
ఏదీ చెంతకు రాదు

నేను నా నీడ
తడవని మొండిగోడ దేహం మీంచి
కదులుతున్నాము కదులుతున్నాము

No posts

Comments

No posts

No posts

No posts

No posts