వేయి మాటల ఉప్పెన's image
NaN min

వేయి మాటల ఉప్పెన

చందలూరి నారాయణరావుచందలూరి నారాయణరావు
0 Bookmarks 45 Reads0 Likes

కోపానికి చీల్చుకొచ్చిన
లోపలి మనిషి నోరు
బయట పుట్టపలిగి

వంద నాలుకల
వేయి మాటల ఉప్పెన
నాలుగు కళ్ళగుండా
వేలమైళ్ళ మేటవేసి

తలలో పాతపగను తాకి
మొగ్గలేసిన సమస్య
పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది.

ఆ నల్లని రోజు నిండా
నిమిషానికో గాయానికి
స్రవించే అరుపులు
చెవుల్లో పొంగి పొర్లి

పక్కనున్న రోజుపై చింది
పగలు చీకటి దుప్పటితో
రాత్రి పగటి వేషంలో
మనసే శత్రువుగా
మనిషి యుద్ధమయ్యాడు.

No posts

Comments

No posts

No posts

No posts

No posts