
0 Bookmarks 49 Reads0 Likes
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని సౌందర్య రూపాలను చూడాలని
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని నాద స్వరాలను వినాలని
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని స్నిగ్ధత్వాలని స్పర్మించాలని
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని పరిమళాల గాఢత్వాలను పీల్చాలని
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని రుచుల కమ్మదనాలను చవిచూడాలని
అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని అనురాగమానసాన్ని అద్వైతించుకోవాలని
No posts
No posts
No posts
No posts

Comments