ఆవాహన's image
0 Bookmarks 22 Reads0 Likes

కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని
మీదాక దేనికి నా మట్టుకు నాకే అనిపించదు

ఎప్పుడో నిన్నమొన్నటి ఇప్పుడెప్పుడో
ఏదో విషాదపు టగాధంలో పడినప్పుడో
ఏదో అనురాగపు గాఢత్వంలో లీనమైనప్పుడో
ఏదో ఆనందపు మేఘాల మీద తేలిపోయినప్పుడో
ఎప్పుడో అలాంటప్పుడెప్పుడో తను నేనైనప్పుడు తప్ప

కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని
మీదాక దేనికి నా మట్టుకు నాకే అనిపించదు

No posts

Comments

No posts

No posts

No posts

No posts