నను మోసిన నవమాసాలు ఓ పండుగే నా తల్లికి.
ఆనందంగా భరించింది అన్ని దినములు. రోజురోజుకి భారమైన, భద్రంగా కాపు కాసింది.
పిచ్చిది కడుపు లోపల లాగితంతే మురుసుకుంది.వినపడలేదు నా తల్లి ఆర్తనాదాలు. ఆ చిన్నపాటి లోకం దాటిన వేళ.
పాపపు పసివాడిని ఆ తల్లికి అంతటి వేదన నా వల్లనే.
అదో వింతే, నా తల్లి నన్ను చూసిన మొదటి క్షణం. నా ఏడుపు చూసి నవ్వుకుంది. ఆనందంతో అల్లాడిపోయింది.


