
Adhunika Maha Bharatam : Telugu Poetry
Author : Gunturu Seshendra Sharma
Pawan Kalyan , Popular Telugu Film Hero and Founder of Janasena Party and Saatyaki S/o Seshendra Sharma met on 3rd May 2016 . During this informal one to one closed door meet , Saatyaki requested Pawan Kalyan to finance reprint of Adhunika Mahabharatam , from which book he has been reciting poems in all his public meetings , citing specially Gunturu Seshendra Sharma as his one and only favorite poet. He readily agreed and by May
నా దేశం నా ప్రజలు
అనే
ఆధునిక
మహాభారతము
(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,
సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)
***
ముఖ్య వివరణ
ఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 – 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు. శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేషజ్యోత్స్న జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.
***
అవతారిక
"ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం నా సంపూర్ణ కావ్యం. కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి – ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు అలాగే ఒకే కావ్యం రాస్తాడు... జీవితం ఒక యాత్ర; యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దీని అర్థాంతరమే, కవి కావ్యయా